తెలంగాణా పై సానుకూల ప్రకటన వెలువడనుందనే ఉహాగానాలు వినిపిస్తుండడంతో సమైక్యాంద్ర విద్యార్ధి ఐక్య కార్యాచరణ సమితి(ఐకాస) ప్రతినిధులు నిన్న ఆంద్ర విశ్వవిద్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని లేదంటే రాష్ట్రంలో అగ్ని గుండాన్ని సృష్టిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశానికి రాష్ట్రానికి చెందిన 12 విశ్వ విద్యాలయాలకు చెందిన ఐకాస ప్రతినిధులు హాజరైయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలుగు వారి మనోభావలకు వ్యతిరేకంగా తెలంగాణా ఇవ్వాలనుకుంటే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని అన్నారు. అలాగే రాష్ట్రం సమైక్యంగానే ఉంచుతామని స్పష్టమైన ప్రకటన చేయాలని వారు కోరారు. ఈ నెల 30న రాష్ట్రాన్ని సమక్యంగానే ఉంచాలని కోరుతూ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ ను కలువనున్నట్లు వారు తెలియజేశారు. ఈ సమావేశంలో నాగార్జున విశ్వవిద్యాలయం, ఆంద్ర విశ్వవిద్యాలయంతో పాటు మరి కొన్ని విశ్వవిద్యాలయాల విద్యార్ధి ఐకాస ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags: News, Telugu News, Andhra News 

0 comments:

Post a Comment

 
Top