రాష్ట్రం సమైక్యంగానే వుంటుందని, ఎట్టిపరిస్థితుల్లోనూ విడిపోదని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానా«థ్ స్పష్టం చేశారు. ఆదివారం విశాఖ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 2009 డిసెంబర్ 23న పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో అదే నెల తొమ్మిదో తేదీన కేంద్ర మంత్రి చిదంబరం చేసిన ప్రకటనకు ప్రాధాన్యం లేనట్టేనని అన్నారు.

అయితే తాజాగా వస్తున్న ఉహాగానాలకు తెరదించాలని, రాష్ట్రాన్ని చీల్చేది లేదని స్పష్టం చేయాలని అధిష్ఠానాన్ని కోరతామన్నారు. విశాఖ రానున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయసింగ్‌ను కలిసి మాట్లాడతామన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు యూ టర్న్‌పై స్పందిస్తూ... కేంద్ర మంత్రిగా ఆయన మాట్లాడి వుంటారని, ఆయన మాటలనుబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Tags: News, Telugu News, Andhra News

0 comments:

Post a Comment

 
Top