తెలుగు వారంతా ఇంటికి చేరే వరకు సహాయక చర్యలు చేపడుతామని టీడీపీ స్పష్టం చేసింది. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా, కర్నూల్, తూర్పుగోదావరి, హైదరాబాద్‌కు చెందిన 13 మంది బాధితులు రాత్రి ఢిల్లీ నుంచి టీడీపీ ఇచ్చిన టికెట్లతో విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. బాధితులకు స్వాగతం పలకడానికి తూర్పుగోదావరి కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, వనపర్తి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే సీతదయాకర్‌రెడ్డి ఎమ్మెల్యేలు, టీడీపీ కార్యకర్తలు ఎయిర్ పోర్టుకు చేరుకుని వారికి ఘన స్వాగతం పలికారు. బాధితులకు విమానాశ్రయంలో ఎన్టీఆర్ ట్రస్టు సభ్యులు పులిహోర ప్యాకెట్లు అందజేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌కు చెందిన పద్మావతి, కోస్గికి చెందిన విజయేంద్ర, అదే జిల్లాకు చెందిన లక్ష్మీదేవమ్మ, అనసూయ, నగరానికి చెందిన లలిత, కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన మరి కొందరు బాధితులు నగరానికి చేరుకున్నారు.
జన హృదయ నేతకు జీవితాంతం రుణపడి ఉంటాం..
'టీడీపీ అధినేత చంద్రబాబు వల్లే మేము ఈ రోజు బతికి బయటకు వచ్చాం' అంటూ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పద్మావతి, విజయేంద్ర కన్నీరు మున్నీరుగా విలపించారు. బాబుగారు అక్కడికి రాకుంటే ఏ ప్రభుత్వాలు పట్టించుకునేవి కావని బోరున విలపించారు. చంద్రబాబు దయ వల్లే ఆ రోజు తమ కుటుంబ సభ్యులను కలుసుకుంటున్నామన్నారు.
రోడ్లపై పడుకుని కాలం వెళ్లాదీశాం: లలిత రామ్‌కోఠి
ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుని హైదరాబాద్ చేరుకున్న బాధితురాలు మనోవేదన ఇది. రోడ్లపై పడుకుని కాలం వెళ్లాదీశామని నగరానికి చెందిన లలితా బోరున విలపిస్తూ చెప్పారు. చంద్రబాబు పూణ్యమా అని ఇక్కడికి చేరుకోగలిగామన్నారు.

Tags: News, Telugu News, AP News, Andhra News
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.