Nara Rohit

నారా రోహిత్ హీరోగా సుధా సినిమాస్ పతాకంపై జె. సాంబశివరావు నిర్మిస్తున్న సినిమా షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. ప్రశాంత్ మండవ దర్శకునిగా పరిచయమవుతున్నారు. శుభ్ర అయ్యప్ప నాయిక. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఫిల్మ్‌నగర్ దైవ సన్నిధానంలో జరిగాయి. నిర్మాత సాంబశివరావు మాట్లాడుతూ "నేటి నుంచే రెగ్యులర్ షూటింగ్ జరుపుతున్నాం. లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ సినిమా రోహిత్ కెరీర్‌లో ఓ ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది'' అని చెప్పారు. విష్ణు, కోట శ్రీనివాసరావు, జయప్రకాశ్‌రెడ్డి, గిరిబాబు, రంగనాథ్, రావు రమేశ్, రఘుబాబు, తెలంగాణ శకుంతల, ప్రగతి తారాగణమైన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: ఆనంద్ రవి, సంగీతం: సాయికార్తీక్, ఛాయాగ్రహణం: చిట్టిబాబు, నిర్మాణ నిర్వహణ: అక్కినేని శ్రీనివాసరావు.

Tags: Film News, Telugu Cinema, Telugu Movie, Tollywood

0 comments:

Post a Comment

 
Top